కాన్సులేట్ జనరల్ సందేశం
శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త వెబ్ సైట్‌కు స్వాగతం.
ఈ వెబ్ సైట్ వినియోగించుకునే వారికి అనుకూలంగా ఉండడానికి మేం అన్ని
ప్రయత్నాలూ చేశాం. కాన్సులేట్‌లో సులభంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని
పొందుపరచడం కాకుండా మీరు ఎదురుచూస్తున్న సమాచారం అందించడానికి
ప్రయత్నించాం. ఒక్కో ప్రత్యేక సేవకు అవసరమైన పత్రాలకు సంబంధించిన సమాచారం
ఒకే చోట లభ్యం అయ్యేట్టు చేయడానికి ప్రత్యేక కృషి చేశాం.
పర్యాటకం, వాణిజ్యం మొదలైన అంశాలపై సమాచారం కోసం ప్రయత్నిస్తున్న
వారికి ఈ వెబ్ సైట్ సింహద్వారంగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.
ముఖ్యమైన వెబ్ సైట్లు అందుబాటులోకి రావడానికి వివిధలింక్‌ల ద్వారా అవసరమైన
సమాచారం అందజేశాం.
ఈ వెబ్ సైట్ మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అయితే దీన్ని
మెరుగు పరచడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఈ వెబ్ సైట్‌లోని అంశాలపై మీ
సూచనలు, అభిప్రాయాలు, ఆలోచనలను ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల ఈ వెబ్‌సైట్‌ను
వినియోగించే వారికి మరింత అనుకూలంగా, ఉపయోగకరంగా మార్చగలం.
మీ వ్యాఖ్యలు/ సూచనలు ఇ-మెయిల్ ద్వారా పంపవచ్చు.
అభినందనలతో
ఎన్. పార్థసారథి
కాన్సులేట్ సేవలు - ఉపయుక్త సమాచారం
- వీసాలు, ఓసిఐ, పిఐఓ కార్డులు, విడనాడే సర్టిఫికేట్ కోసం దరఖాస్తు
చేసుకోవడం వంటి పనులు నిర్వర్తించే బాధ్యతను మెసర్స్ ట్రావీసా
ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాం. అందువల్ల ఈ సేవలకు సంబంధించిన సమాచారం
కావాలనుకునేవారు/ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటో తెలుసుకోగోరే వారు
ట్రావీసా ఔట్‌సోర్సింగ్ కంపెనీలో ట్రావీసా ఔట్‌సోర్సింగ్‌ను మాత్రమే
సంప్రదించాలి. ఈ సేవలపై కాన్సులేట్ ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పే
స్థితిలో ఉండదు. అయితే మీ దరఖాస్తుల పరిశీలనలూ సమస్యలు ఏమైనా ఉంటే
కాంటాక్ట్ అజ్ పేజీలో కాన్సులేట్‌ను సంప్రదించవచ్చు.
- ఈ వెబ్ పేజీలను వినియోగించుకునే వారికి అనుకూలంగా మార్చాం గనక
దీనికి సంబంధించిన పేజీలను చూడండి. సమాచారాన్ని జాగ్రత్తగా
పరిశీలించండి. ఎందుకంటే మీ ప్రశ్నలకు అక్కడ ఇదివరకే సమాధానం
ఉండొచ్చు. సమాచారం సులభంగా అందుబాటులో ఉన్న అంశాలకు సంబంధించి పంపే
ఇ-మెయిల్స్‌కు కాన్సులేట్ సమాధానం పంపకపోవచ్చు.
- పాస్‌పోర్టు/ వివిధ సేవలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కోసం
కాంటాక్ట్ అజ్ పేజీలో ఉన్న లింక్‌లను ఉపయోగించుకోండి. కాన్సులేట్‌ను
టెలిఫోన్ ద్వారా: (415) 668-0662కు (వారంలో పని దినాల్లో మధ్యాహ్నం 2
గంటల నుంచి 6.30 మధ్య) సంప్రదించవచ్చు. ఒకవేళ ఫోన్ లైన్లు దొరకకపోతే
ఇ-మెయిల్ పంపి సమాధానం పొందవచ్చు.
- పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేవారు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.
ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించినప్పుడు అపాయింట్‌మెంట్ తేదీ
దానంతట అదే అందుతుంది. అయితే అపాయింట్‌మెంట్ తీసుకున్న నిర్దిష్ట తేదీల్లో
ముందు వచ్చిన వారి దరఖాస్తులనే అంగీకరిస్తాం.
- వివిధ సేవల కోసం దరఖాస్తు చేసేవారు అపాయింట్‌మెంట్
తీసుకోనక్కర్లేదు. దరఖాస్తుదారులు కార్యాలయం పనిచేసే రోజుల్లో ఉదయం 9 నుంచి
12 గంటల మధ్య కాన్సులేట్‌ను సందర్శించవచ్చు. దీనికి కూడా ముందు వచ్చిన
వారికే ప్రాధాన్యం ఉంటుంది.
- అన్ని పవర్ ఆఫ్ అటార్నీలను ముందు నోటరీ చేయించి అధికారికంగా
ధ్రువీకరించాలి. ముందు అలా ధ్రువీకరించిన దరఖాస్తులనే కాన్సులేట్
ప్రామాణీకరిస్తుంది.
- ఇండియాకు చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారు పాస్‌పోర్ట్ గడువు
తీరిపోయినప్పటికీ (ఇండియా వీసా ఉన్నవారు) ప్రస్తుతం చెల్లుబాటయ్యే
పాస్‌పోర్టుతో ఇండియా సందర్శించవచ్చు. అయినా అలాంటి వారు భారత వీసాను
చెల్లుబాటయ్యే అమెరికా పాస్‌పోర్టుకు బదిలీ చేయడం సులభంగా
ఉపయోగించుకోవడానికి ఉపకరిస్తుంది.
సంబంధిత పేజీల మీద ఫాంలు/ అఫిడవిట్లు అందుబాటులో ఉన్నాయి.
మీకు
నిర్దిష్టమైన ఫాం/ అఫిడవిట్ కావాలంటే ఇక్కడ
ఫాం / అఫిడవిట్ మీద క్లిక్
చేయండి.